Header Banner

షాకింగ్ న్యూస్! పహల్గాం ఉగ్రవాదుల చెరలో బీజేపీ నేత కూతురు! తర్వాత ఏం జరిగింది?

  Sat Apr 26, 2025 18:10        India

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ భయంకర షాక్ నుంచి ఒక్కొక్కరి స్టోరీస్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ఉగ్రవాదులు ఏ విధంగా తమ కుటుంబ సభ్యులను మతం అడిగి, బట్టలు విప్పి చూసి, కల్మా చదవడం వచ్చా అని అడిగి చంపేశారో తెలిపారు. మరికొంత మంది మాత్రం ఇంకా ఆ షాక్ లోనే ఉన్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఓ కీలక కథనం వెలుగులోకి వచ్చింది. పహల్గాం​ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో ఓ కశ్మీరీ గైడ్​ప్రాణాలకు తెగించి.. ఓ బీజేపీ నేత కూతురిని రక్షించాడు. ఈ విషయాన్ని ఆ బీజేపీ నేత స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.

 

ఛత్తీస్ ఘడ్ కు చెందిన బీజేపీ యువ మోర్చా(BJYM) నాయకుడు అరవింద్ అగర్వాల్ తనకు జరిగిన షాకింగ్ ఘటనను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో అరవింద్ అగర్వాల్ కుటుంబం బైసరన్ వ్యాలీలోనే ఉంది. హాలీడే ట్రిప్ కోసం తన భార్య, కూతురుతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఆయన ఈ భావోద్వేగ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. తమ టూరిస్ట్ గైడ్ నజకత్ అలీ లేకుంటే తమ కూతురు ఉగ్రవాదుల చేతిలో బలి అయ్యేదని చెప్పుకొచ్చారు. ' నువు నీ ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడావు. థ్యాంక్స్ అనేది చిన్న విషయం' అని తెలిపారు అరవింద్ అగర్వాల్.



ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

నజకత్ అలీ.. తన నాలుగేళ్ల పాపను ఎలా రక్షించాడో ఓ ప్రముఖ ఛానల్ కు వివరించారు అరవింద్ అగర్వాల్. "మేము బైసరన్ వ్యాలీలో ఉన్నప్పుడు గన్ షార్ట్స్, ప్రజల ఆర్తనాదాలు వినిపించాయి. మేము పరిగెత్తాం. అక్కడున్న కంచె పైనుంచి దూకేద్దాం అనుకున్నాం. కానీ మా నాలుగేళ్ల చిన్నారి సమృద్ధి.. ఆ బుల్లెట్ సౌండ్, ప్రజల ఏడుపు చూసి భయపడింది. మా నుంచి అలా పక్కన ఉన్న గ్రౌండ్ లోకి పరుగులు తీసింది. చిన్నారి వెంట నా భార్య పరిగెత్తింది. లక్కీగా వారి వెంట మా టూరిస్టు గైడ్ నజకత్ అలీ ఉన్నాడు. ఇంతలో ఓ ఉగ్రవాది వారి వద్దకు వచ్చి ఈ పాప ఎవరి కూతురు అని నజకత్ అలీని అడగ్గా.. నా కూతురే అని బదులిచ్చాడు. దీంతో ఆ తీవ్రవాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లేదంటే నా కూతుర్ని చంపేసేవారు. ఆ తర్వాత హార్స్ రైడర్స్ సాయంతో అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డాం. వారి నుంచి తప్పించుకునే క్రమంలో నా భార్య కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో స్థానికుల సాయంతో ఓ ఆస్పత్రిలో చేర్పించాం" అని అరవింద్ అగర్వాల్ తెలిపాడు.


ఇదే ఘటనపై టూరిస్టు గైడ్ నజకత్ అలీ ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడాడు. " కాల్పుల సమయంలో నేను అరవింద్ అగర్వాల్ పిల్లలతో ఉన్నాను. గన్ సౌండ్స్ వినిపించాయి. పిల్లలు టపాసులు కాలుస్తున్నారేమో అనుకున్నా. మరికొంత సమయానికి శబ్దాలు భారీగా పెరిగాయి. దీంతో పిల్లలను నేను దగ్గరకు తీసుకున్నా. నేను టూరిస్టు గైడ్ ను ఆ 11 మందిని సంరక్షించడం నా బాధ్యతగా భావించా" అని నజకత్ అలీ చెప్పుకొచ్చాడు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #pahalgamattack #terrorshock #bjpnews #savedgirl #kashmirviolence #terrorism #breakingnews #emotionalstory